![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో ప్రతీ వారం లైం లైట్ లో ఉన్న స్టార్స్ ని తీసుకొస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలాగే మూవీ ప్రొమోషన్స్ ని కూడా చేస్తూ ఉంటుంది సుమ. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 9 న ప్రసారం కాబోతోంది. ఇక ఈ ఎపిసోడ్ కి నటరాజ్ మాష్టర్ , నీతూ, ఆట సందీప్, జ్యోతిరాజ్ జోడీలు వచ్చాయి. రీసెంట్ గా వీళ్లంతా కలిసి "నీతోనే డాన్స్" రియాలిటీ షోలో పోటాపోటీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అలాగే టైటిల్ ని ఆట సందీప్ జోడి విన్ ఐన విషయం కూడా తెలిసిందే.
ఈ రెండు జోడీలు రొమాంటిక్ డాన్స్ లు పెర్ఫార్మ్ చేస్తూ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చాయి. "ఎప్పుడైనా ఇంట్లో గొడవయ్యి అప్పుడు కూడా ఇంట్లో ఇలాగే రొమాంటిక్ డాన్స్ చేస్తాడా" అని ఆట సందీప్ ని సుమ అడిగింది "నాతో ఎక్కువగా డాన్స్ చేస్తారు ఇంట్లో" అని చెప్పింది జ్యోతి. "ఎక్కువ అంటే తక్కువ వేరే వాళ్ళతో చేస్తాడా" అని రివర్స్ లో అడిగింది సుమ. "అందరితో అన్ని చేస్తాడు" అని చెప్పింది జ్యోతి. తర్వాత ఇద్దరూ కలిసి "ఎన్నో రాత్రులొస్తాయి కానీ" అనే సాంగ్ కి రొమాంటిక్ డాన్స్ చేశారు. దానికి సుమ వెళ్లి టేబుల్ కింద దాక్కుంది. "నేను ఇంత దగ్గరగా రొమాంటిక్ సాంగ్ ని ఎప్పుడూ చూడలేదు" అని చెప్పింది సుమ. తర్వాత క్విజ్ ప్రశ్నలు అడిగింది "అమ్మాయిలు బ్రేకప్ అయ్యాక చేసే పనేంటి" అనేసరికి నీతూ "ఎమోషనల్ పాటలు వింటారు" అని అంది. ఐతే ఇప్పుడు ఎవరూ అంత ఎమోషనల్ ఐతే వినడం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్లిపోతున్నారు. ఇకపోతే ఈ క్వశ్చన్ కి ఎంత పెడతారు అని సుమ అడిగేసరికి లక్ష అని చెప్పింది నీతూ. అది రాంగ్ ఆన్సర్ అని చెప్పింది జ్యోతి ..మరి ఇంతకు జ్యోతి చెప్పిన ఆన్సర్ ఏమిటి నీతూ చెప్పింది కరెక్టా రాంగా చూడాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.
![]() |
![]() |